కెసిఆర్ అసలు సిసలు తెలంగాణ ద్రోహి: నరేంద్ర
మెదక్: బహుజన సమాజ్ పార్టీ (బియస్పీ)లో చేరే విషయాన్ని ఆ పార్టీ నాయకురాలు మాయావతిని కలిసిన తర్వాతనే నిర్ణయించుకుంటానని తెలంగాణ రాష్ట్ర సమితి (ఎన్) అధ్యక్షుడు ఎ. నరేంద్ర చెప్పారు. తెలంగాణ విమోచన దినోత్సవంలో తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు పాల్గొనకపోవడం దారుణమని, కెసిఆర్ అసలైన తెలంగాణ ద్రోహి అని రుజువైందని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ నాయకులందరూ ఆ పార్టీ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ గౌడ్ మాదిరిగా వ్యవహరిస్తే తెలంగాణ రాష్ట్రం వెంటనే వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. తెరాసను తమతో స్నేహానికి బిజెపి ఆహ్వానించడం నాటకమని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications