వైయస్ ఆఫీసులో షార్ట్ సర్క్యూట్ కలకలం
హైదరాబాద్: సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయం గల సి బ్లాకులోని ఆరవ అంతస్థులో అగ్ని ప్రమాదం కలకలం సృష్టించింది. కరెంట్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం సంభవించింది. వెంటనే ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిని క్యాంపు కార్యాలయానికి తరలించారు. ఇది పెద్ద ప్రమామేమీ కాదని, మినీ కాన్ఫరెన్స్ హాలులో ఇది సంభవించిందని అధికారులు చెప్పారు.
సి బ్లాకులోని ఆరవ అంతస్థులో కరెంట్ వైరింగ్ చాలా పాతదని, అందువల్లనే షార్ట్ సర్క్యూట్ సంభవించిందని అధికారులు చెబుతున్నారు. ఇంతకు ముందు ఒకటి రెండు సార్లు ఇటువంటి సంఘటనలు జరిగాయి. ఇంతకు ముందు ముఖ్యమంత్రి కార్యాలయం నాలుగవ అంతస్థులో ఉండేది. దాన్ని ఆరవ అంతస్థుకు మారింది.












Click it and Unblock the Notifications