తెరాస మాతో కలిసి రావాలి: రాజ్ నాథ్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమతో జత కట్టాలని భారతీయ జనతా పార్టీ (బిజెపి) జాతీయ అధ్యక్షుడు రాజ్ నాధ్ సింగ్ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ని కోరారు. తాము కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు తమతో ఉండి ఆ తర్వాత తెరాస తమతో విడిపోయినా అభ్యంతరం లేదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తమ ద్వారానే సాధ్యమవుతుందని ఆయన చెప్పారు.
హైదరాబాద్ పేలుళ్ల ఘటనలో నిందితులను రక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు. తీవ్రవాదం పట్ల కేంద్ర ప్రభుత్వం మెతక వైఖరి అవలంబిస్తోందని, పొటా కన్నా కఠినమైన చట్టాన్ని ఉపయోగించి తీవ్రవాదాన్ని అరికట్టాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications