ఇంట్లో వెంకట్ ను ప్రశ్నించిన సిఐడి పోలీసులు
హైదరాబాద్: రియల్ ఎస్టేట్ వ్యాపారి ప్రశాంత్ రెడ్డి హత్య కేసులో నిందితుడు, పిసిసి మాజీ అధ్యక్షుడు కె. కేశవరావు కుమారుడు వెంకట్ ను సిఐడి పోలీసులు ప్రశాసన్ నగర్ లో ప్రశ్నిస్తున్నారు. ప్రశాంత్ నగర్ లోని వెంకట్ ఇంటిలో ఈ విచారణ మంగళవారం ఉదయం పదిన్నర గంటల ప్రాంతంలో ప్రారంభమైంది. వెంకట్ ఇంటిలో పోలీసులు సోదాలు కూడా నిర్వహించారు. వెంకట్ ను సిఐడి పోలీసులు సోమవారంనాడు తమ కస్టడిలోకి తీసుకున్నారు.
మృతికి ముందు ప్రశాంత్ రెడ్డి వెంకట్ ఇంట్లోని ఏయే గదుల్లో తిరిగాడని, ఇంట్లో అతని కదలికలు ఏమిటనే విషయాలను పోలీసులు అడిగి తెలుసుకున్నారు. లెసెన్స్ గన్ బయటకు ఎలా వచ్చిందనే విషయంపై కూడా వారు ఆరా తీశారు. ప్రశాంత్ రెడ్డి ఆత్మహత్య చేసుకుని ఉంటే రెండు బుల్లెట్ ఎలా వచ్చిందనే విషయంపై వారు దృష్టి పెట్టారు. ఫోరెన్సిక్ నివేదికను సిఐడి పోలీసులు కోర్టుకు సమర్పించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications