ఇంకా ఆగని వర్షాల ధాటి
విశాఖపట్నం: కోస్తా ఆంధ్ర తీరాన్ని ఆనుకుని బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో మరో 36 గంటల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని విశాఖపట్నంలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.
దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ జిల్లాలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు. అల్పపీడనానికి రుతుపవనాలు తోడు కావడంతో తెలంగాణ, రాయలసీమ, కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి.












Click it and Unblock the Notifications