'అనంత' హత్యలపై హైకోర్టులో పిటిషన్
హైదరాబాద్: అనంతపురం జిల్లాలో జరిగిన రాజకీయ హత్యలపై మూడు వారాల్లోగా నివేదిక సమర్పించాలని ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన రాష్ట్ర హైకోర్టు బెంచ్ జిల్లా న్యాయమూర్తిని ఆదేశించింది. అనంతపురం జిల్లాలో జరిగిన హత్యలపై తెలుగుదేశం పార్టీ నాయకుడు ఇ. పెద్దిరెడ్డి వేసిన పిటిషనును హైకోర్టు శుక్రవారంనాడు విచారణకు స్వీకరించింది.
అనంతపురం జిల్లాలో 2005లో 40 మంది హత్యకు గురయ్యారని, వీరిలో ఎక్కువ మంది తమ పార్టీకి చెందినవారేనని పెద్దిరెడ్డి తన పిటిషనులో అన్నారు. అనంతపురం జిల్లా పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. పిటిషనర్ తరఫున ప్రముఖ న్యాయవాది రామచంద్రరావు, ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ మోహన్ రెడ్డి కోర్టులో హాజరయ్యారు.












Click it and Unblock the Notifications