చిరంజీవి రాజకీయాలకే "తెలంగాణ" అడ్డంకి
హైదరాబాద్: చిరంజీవి రాజకీయాల్లోకి రావడానికి సర్వం సిద్ధమైనా, ఆయన పార్టీకి ఇప్పుడు అడ్డంకిగా ఉన్న అంశం- తెలంగాణేనని స్పష్టమవుతోంది. భవిష్యత్తులో చిరంజీవి పార్టీతో పొత్తు ఉంటుందో లేదో ఇప్పుడే ఎలా చెప్పగలమని, ఆయన పార్టీ విధానాన్ని బట్టి తమ వైఖరి ఉంటుందని సిపీఐ నాయకుడు నారాయణ చెప్పారు.ప్రత్యేక తెలంగాణకు సిపిఐ అనుకూలంగా మారిన విషయం తెలిసిందే.
చిరంజీవి పార్టీ ఆర్ధిక విధానాలతో పాటు తెలంగాణపై ఆయన వైఖరిని బట్టి పొత్తుపై తమ నిర్ణయం ఆధారపడి ఉంటుందని సిపిఐ సంకేతాలు పంపినట్టయింది. తెలంగాణపై కాంగ్రెస్ వైఖరి స్పష్టమయ్యాకే రాజకీయాలోకీ రావాలని చిరంజీవి యోచిస్తున్నట్టు తెలిసింది.












Click it and Unblock the Notifications