ఉత్తర కోస్తాకు భారీ వర్ష సూచన
విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శుక్ర వారం రాత్రికి వాయుగుండంగా మారింది. ప్రస్తుతం ఇది పూరీకి 150 కిలోమీటర్ల దూరంలో
కేంద్రీకృతమై ఉంది.
వాయుగుండం శనివారం మధ్యాహ్నం మరింత తీవ్రమై తీరం దాటే ప్రమాదముందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీని ప్రభావంతో వచ్చే 36 గంటల్లో ఉత్తర కోస్తా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వారు తెలిపారు.












Click it and Unblock the Notifications