వినాయక నిమజ్జనం ఏర్పాట్లపై వైఎస్ సమీక్ష
హైదరాబాద్: వినాయకుడి విగ్రహాల నిమజ్జనం ఏర్పాట్లపై ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి శనివారం ఉదయం ఉన్నత స్ధాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ లో పేలుళ్ళు, విధ్వంసానికి పాల్పడుతామనీ తీవ్రవాదులు ఫెచ్చరించిన నేపధ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది.
హోంమంత్రి జానారెడ్డి. డీజీపి బాసిత్, ఇతర పోలీసు ఉన్నతాదికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. నిమజ్జనోత్సవాల్లో అత్యంత అప్రమత్తంగా వ్యవహరించవలసిందిగా ముఖ్యమంత్రి పోళీసు శాఖను కోరారు.
నిమజ్జనం కోసం హైదరాబాద్ లోనే 15 వేల మంది పోలీసు సిబ్బందిని నియమిస్తున్నట్టు హోం మంత్రి జానారెడ్డి చెప్పారు. మళ్ళీ పేలుళ్ళు జరుతాయంటూ డిజీపీకి వచ్చిన లేఖపై సమగ్రంగా దర్యాప్తు జరుగుతోందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
