హైదరాబాద్ నడిబొడ్డున మహిళ హత్య: దోపిడీ
హైదరాబాద్: హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న మధురానగరులో దోపిడీ దొంగలు ఒక మహిళను హత్య చేసి దోపిడీకి పాల్పపడ్డారు. సోమవారం ఉదయం తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో ఈ దోపిడీ జరగడం సంచలనం సృష్టించింది. మధురానగరులోని ఒక క్వార్టరులో తల్లీకూతురు నివాసం ఉంటున్నారు. కూతురు సినిమాల్లో వేషాలు వేస్తూ ఉంటుంది. ఈ ప్రాంతంలో సినిమాల్లో పనిచేసే వారు ఎక్కువగా ఉంటారు.
ఉదయం కూతురు బయటకు వెళ్లడంతో తల్లి కమలాదేవి ఒక్కతే ఇంట్లో ఉంది. ఈ సమయంలో దుండగులు ఇంట్లోకి ప్రవేశించి నగలు, చీరలు, బంగారు ఆభరణాలు దోచుకున్నారు. ఈ
సమయంలో అడ్డుకోవడానికి ప్రయత్నించిన కమలాదేవి మెడపై దొంగలు గాయపరిచారు. దీంతో ఆమె కింద పడిపోయి ప్రాణాలు విడిచింది. సంఘటన గురించి తెలిసిన వెంటనే కూతురు అక్కడికి చేరుకుంది. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఏ మేరకు దోపిడీ జరిగింది తెలియడం లేదు.












Click it and Unblock the Notifications