మాస్కో నుంచి వచ్చాకే పిసిసి ఎంపిక: మొయిలీ
న్యూఢిల్లీ: తాను మాస్కో నుంచి తిరిగి వచ్చిన తర్వాతనే కొత్త ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడి ఎంపిక జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి వీరప్ప మొయిలీ చెప్పారు. ఆయన ఈ నెల 30వ తేదీన రష్యా పర్యటనకు బయలుదేరి వెళ్తున్నారు. తిరిగి వచ్చే నెల 6వ తేదీన తిరిగి వస్తున్నారు. తాను తిరిగి వచ్చిన తర్వాత పిసిసి అధ్యక్షుడి ఎంపికపై సంప్రదింపులు జరుపుతానని మొయిలీ బుధవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు.
పిసిసి ఎంపిక కోసం ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ చార్జిగా పనిచేసిన దిగ్విజయ్ సింగ్ అభిప్రాయం కూడా తీసుకోవాల్సి ఉందని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డితో చర్చలు జరపాల్సి ఉందని కూడా ఆయన చెప్పారు. పిసిసి అధ్యక్షుడి ఎంపిక సాధ్యమైనంత త్వరగా జరపాలనేదే తన అభిమతమని, అయితే కచ్చితమైన గడువును ఇప్పుడే చెప్పలేనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
