అజ్మీర్ దర్గా పేలుడులో హైదరాబాదీ మృతి
హైదరాబాద్: రాజస్థానులోని అజ్మీర్ దర్గా పేలుడులో మరణించినవారిలో హైదరాబాదుకు చెందిన వ్యక్తి ఉన్నట్లు గుర్తించారు. ఈ పేలుడులో హైదరాబాదులోని టోలీచౌక్ కు చెందిన సయ్యద్ సలీం అనే యువకుడు మరణించినట్లు తెలుస్తోంది. ఇతను గత 12 ఏళ్లుగా అజ్మీరులో ఉంటున్నట్లు సమాచారం. హైదరాబాదులోని కార్వాన్ శాసనసభ్యుడు అఫ్సర్ ఖాన్ సలీం కుటుంబ సభ్యులను పరామర్శించారు. గురువారం సాయంత్రం అజ్మీర్ దర్గాలో పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ పేలుడుకు హైదరాబాదులోని మక్కా మసీదులో సంభవించిన పేలుడుకు పోలికలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
అజ్మీర్ దర్గాలో పేలుడుకు సంబంధించి దర్యాప్తు నిమిత్తం రాజస్థాన్ పోలీసులు హైదరాబాద్ రావాలని అనుకుంటున్నట్లు సమాచారం. అజ్మీర్ దర్గాలో పేలుడు నేపథ్యంలో హైదరాబాదులో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. రంజాన్ పర్వదినం చివరి శుక్రవారం కావడంతో ప్రార్థనా మందిరాల వద్ద గస్తీని పటిష్టం చేశారు. ప్రధాన కూడళ్లలో సిసి కెమెరాలను ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications