తూర్పు గోదావరి జిల్లాలో బాబు ఏరువాక పర్యటన
రాజమండ్రి: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు సోమవారం తూర్పు గోదావరి జిల్లాలో ఏరువాక పర్యటన జరిపారు. ఇందులో భాగంగా ఆయన రాజమండ్రి నుంచి రామచంద్రాపురం వరకు రోడ్ షో నిర్వహించారు. వరిధాన్యం పండించే రైతులపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆయన విమర్శించారు. తాము గోధుమలు పండించే రైతులకు వ్యతిరేకం కాదని, అయితే వరి రైతులకు గిట్టుబాటు ధర ప్రకటించాల్సి వుందని ఆయన అన్నారు.
వరికి మద్దతు ధరపై కల్పించే విషయంపై రాష్ట్రానికి చెందిన 30 మంది కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు కూడా ఏమీ మాట్లాడడం లేదని ఆయన విమర్శించారు. తృతీయ ఫ్రంట్ అధికారంలో వస్తే వరి రైతులకు మద్దతు ధర కల్పిస్తామని ఆయన అన్నారు. వరి రైతుల పట్ల ప్రస్తుతం ప్రదర్శిస్తున్న వివక్ష గతంలో ఎప్పుడూ లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications