ఏనుగుల దాడిలో ఇద్దరు మృతి
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఏజెన్సీ ప్రాంతంలో ఏనుగుల దాడిలో తాజాగా ఇద్దరు మరణించారు. ఈ సంఘటన సీతంపేట మండలంలోని కె. వీరఘట్టం గ్రామం వద్ద జరిగింది. ఇటీవల విజయనగరం జిల్లాలో ఏనుగులు దాడి చేసి ఒక బాలుడ్ని చంపిన సంఘటన మరిచిపోకముందే ఈ సంఘటన చోటుచేసుకోవడం ఏజెన్సీ ప్రాంత ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది.
పక్క ఊరిలోని జాతరకు ఆదివారం రాత్రి 9 మంది వ్యక్తులు బయలుదేరారు. ఈ సమయంలో అకస్మాత్తుగా ఏనుగులు వారిపై దాడి చేశాయి. ఈ దాడిలో ఇద్దరు మరణించగా మిగతా ఏడుగురు తప్పించుకున్నారు.












Click it and Unblock the Notifications