వైయస్ బావమరిది అక్రమ భూకబ్జా: పిజెఆర్
హైదరాబాద్: కడప మేయర్, ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి బావమరిది రవీంద్రారెడ్డి, కడపకు చెందిన రాజమౌళి రెడ్డి హైదరాబాదులోని ఖైరతాబాదులో గల ప్రగతినగరులో అక్రమ భూకబ్జాలకు పాల్పడ్డారని కాంగ్రెస్ సీనియర్ శాసనసభ్యుడు పి. జనార్దన్ రెడ్డి ఆరోపించారు. ఆయన సోమవారంనాడు ఆ ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
ఈశ్వరి ప్రాజెక్టు పేర నాలాను, పార్కును కబ్జా చేశారని, ఈ విషయంపై ముఖ్యమంత్రికి లేఖ రాస్తానని ఆయన చెప్పారు. ప్రగతినగరులోని కబ్జా చాలా తీవ్రమైన విషయమని, దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications