సరికొత్త రికార్డు: సెన్సెక్స్ 19వేల మార్కు
ముంబాయి: స్టాక్ మార్కెట్ సోమవారం మరింత పుంజుకుని ఆల్ టైం రికార్డును సృష్టించింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ ఓ దశలో 612 పాయింట్లు పెరిగి చరిత్రలో తొలిసారిగా 19వేల మైలురాయి దాటి సరికొత్త రికార్డు సృష్టించింది. కేవలం నాలుగు ట్రేడింగ్ సెషన్లలోనే సెన్సెక్స్ 18వేల నుంచి 19వేలకు చేరడం గమనార్హం. నాలుగురోజుల క్రితం సెన్సెక్స్ 18 వేల మార్కును చేరుకుని రికార్డు సృష్టించగా, సోమవారం మరింత పుంజుకుని అతి వేగంగా 19 వేల మార్కును చేరుకుంది.
ఐదు కంపెనీలు షేర్లతో నాలుగురోజుల్లోనే ఇంత వేగంగా సెన్సెక్స్ పెరగడం మరో రికార్డుగా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ ఎనర్జీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్ అండ్ టీ, ఓఎన్‌జీసీ కంపెనీలు షేర్లతో 600 పాయింట్లు పుంజుకున్న సెన్సెక్స్ 19000 కు చేరుకుని చరిత్ర సృష్టించింది.












Click it and Unblock the Notifications