పాకిస్తాన్ లో కాలు పెట్టిన బెనజీర్ భుట్టో
కరాచీ: సుదీర్ష కాలం తర్వాత పాకిస్తాన్ మాజీ ప్రధాని, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పిపిపి) నాయకురాలు బెనజీర్ భుట్టో కరాచీలో అడుగు పెట్టారు. దాదాపు 8 ఏళ్లు విదేశాల్లో గడిపిన ఆమెకు కరాచీలో అభిమానుల నుంచి ఘనస్వాగతం లభించింది. పాకిస్తాన్ కాలమానం ప్రకారం - బెనజీర్ భుట్లో మధ్యాహ్నం రెండు గంటలకు ఎమరేట్స్ ఫ్లయిట్ లో కరాచీ విమానాశ్రయంలో కాలు పెట్టారు.
ఆమెతో పాటు ఆమె సోదరి సనమ్, ఇతర సమీప బంధువులు, మిత్రులు, మీడియా ప్రతినిధులు వచ్చారు. ఆమె రాక సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. రేడియా జామర్ గల రెండు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను ఆమె వాడుతారు. తాలిబాన్ అనుకూల శక్తుల నుంచి, ఆల్ ఖైదా నుంచి ఆమె ప్రాణాలకు ముప్పు ఉన్నట్లు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications
