పారిపోయిన ఏనుగు, తిరిగి బందీ
విజయనగరం: శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో చేపట్టిన అపరేషన్ గజేంద్ర అనూహ్య మలువులు తిరుగుతోంది. అడవి ఏనుగులను పట్టేయడానికి చేపట్టిన ఆపరేషన్ గజేంద్ర శనివారంనాడు మూడో రోజుకు చేరుకుంది. బంధించి ఉంచిన ఏనుగు ఒకటి చెట్టుతో సహా పెకిలించుకుని పారిపోయి అడవి ఏనుగుల మందతో కలిసింది. అయితే దాన్ని మళ్లీ శిక్షణ ఏనుగుల సహాయంతో పట్టుకున్నారు.
పట్టుకున్న రెండు ఏనుగులను లారీల్లో ఒరిస్సాకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే సరైన రహదారులు లేకపోవడంతో వాటి తరలింపు కష్టమవుతోంది. అంతా సజావుగా జరిగితే ఆపరేషన్ గజేంద్ర కార్యక్రమం ఒకటి రెండు రోజుల్లో పూర్తవుతుందని విజయేంద్ర చౌదరి అంటున్నారు. ఏనుగులను చూడడానికి పెద్ద యెత్తున ప్రజలు తరలి వస్తున్నారు. దీంతో అక్కడ జాతర వాతావరణం నెలకొంది. ప్రజల అవసరాలు తీర్చడానికి దుకాణాలు కూడా వెలిశాయి.












Click it and Unblock the Notifications