ప్రీతి వాంగ్మూలం కూడా తీసుకోవాలి: సిఐడి
హైదరాబాద్: పిసిసి మాజీ అధ్యక్షుడు కె. కేశవరావు కుమారుడు వెంకట్ ఇంట్లో జరిగిన కాల్పుల్లో మరణించిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ప్రశాంత్ రెడ్డిది ఆత్మహత్య కాదని సిఐడి స్పష్టం చేసింది. ప్రశాంత్ రెడ్డి మృతి కేసును విచారిస్తున్న మానవ హక్కుల కమీషనుకు సిఐడి సోమవారంనాడు నివేదిక సమర్పించింది. ప్రశాంత్ రెడ్డి మృతి కేసులో ప్రత్యక్ష సాక్షులు లేరని, అందువల్ల శాస్త్రీయ విశ్లేషణల ద్వారానే నివేదికను తయారు చేశామని సిఐడి తెలియజేసింది. ప్రశాంత్ రెడ్డి రెండో భార్య ప్రీతి వాంగ్మూలాన్నీ రికార్డు చేయాలని సిఐడి మానవ హక్కుల కమీషనును కోరింది.
ప్రశాంత్ రెడ్డిది హత్యేనని సిఐడి తన నివేదికలో స్పష్టం చేసింది. కేసు విచారణను మానవ హక్కుల కమీషన్ నవంబర్ 12వ తేదీకి వాయిదా వేసింది. ప్రశాంత్ రెడ్డి మృతి కేసులో అరెస్టయిన వెంకట్ కు కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications