శ్రీజ దంపతులకు రెండు వారాలు భద్రత
న్యూఢిల్లీ: మెగా స్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ, శిరీష్ భరద్వాజ్ దంపతులకు రెండు వారాలు రక్షణ కల్పిస్తూ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తమకు రక్షణ కల్పించాలని కోరుతూ శ్రీజ దంపతులు దాఖలు చేసిన పిటిషనుపై హైకోర్టు సోమవారం ఆ ఆదేశాలు జారీ చేసింది. శ్రీజ దంపతులు వారం రోజుల పాటు రక్షణ కోరగా హైకోర్టు రెండు వారాలు రక్షణ కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
తమకు భద్రత కల్పిస్తామని హైదరాబాద్ పోలీసు కమీషనర్ కూడా హామీ ఇచ్చారని శ్రీజ భర్త శిరీష్ భరద్వాజ్ చెప్పాడు. తాము రెండు వారాల్లో హైదరాబాదు వెళ్తామని అతను చెప్పాడు. తమకు ఇంకా ప్రమాదం ఉందని శ్రీజ అంటోంది. తమకు శ్రీజ దంపతులు ఫీజు ఇవ్వలేదని వారి తరఫు న్యాయవాది పింకీ ఆనంద్ ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో చెప్పారు. చిరంజీవి మౌనం వీడి పిల్లలను ఆహ్వానించాలని ఆమె కోరారు.












Click it and Unblock the Notifications