నాన్న మీడియా ముందుకు వచ్చి చెప్పాలి: శ్రీజ
న్యూఢిల్లీ: నాన్న మీడియా ముందుకు వచ్చి తామంతా కలిసిపోయామని అభిమానులకు తెలియజేయాలని మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజ విజ్ఞప్తి చేసింది. తన తండ్రి చిరంజీవి కోర్టుకు రాసిన లేఖ సంతృప్తికరంగానే ఉందని, అయితే తాము మరికొన్ని ప్రశ్నలు అడిగామని, వాటికి సమాధానం రావాల్సి ఉందని ఆమె సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నది. తన ప్రాణాలకు ముప్పేం లేదని, శిరీష్ కే ముప్పు ఉందని ఆమె అన్నది. ఆ విషయం శిరీష్ చెబుతాడని ఆమె చెప్పింది.
తమకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని శిరీష్ భరద్వాజ్ చెప్పాడు. అవి ఎవరి నుంచి వస్తున్నాయో అర్థం కావడం లేదని, పరిస్థితిని అవకాశంగా తీసుకొని ఇతరులెవరైనా ఆ కాల్స్ చేస్తూ ఉండవచ్చునని, ఎవరనేది మాత్రం తెలియడం లేదని అతను అన్నాడు. తమను అభినందిస్తూ చాలా కాల్స్ వస్తున్నాయని శిరీష్ చెప్పాడు. తమకు హైదరాబాదులో గ్రాండ్ రిసెప్షన్ ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారని అతను చెప్పాడు.












Click it and Unblock the Notifications