లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కిన ఆబ్
ఒంగోలు: ప్రకాశం జిల్లా కందుకూరు ఆబ్కారీ సర్కిల్ ఇన్స్ పెక్టర్ (సిఐ) వెంకటేశ్వర్లు లంచం తీసుకుంటూ ఆదివారం అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులకు పట్టుబడ్డారు. వైన్ షాపులకు చెందిన మధ్యవర్తి నుంచి 77 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా వెంకటేశ్వర్లును ఎసిబి అధికారులు పట్టుకున్నారు. ఒక్కో వైన్ షాపు నుంచి వెంకటేశ్వర్లు 15 వేల రూపాయల లంచం డిమాండు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
వెంకటేశ్వర్లు వేధింపులను భరించలేని వైన్ షాపుల యజమానులు ఎసిబి అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎసిబి అధికారులు వల పన్ని అతన్ని పట్టుకున్నారు. వెంకటేశ్వర్లు వేధింపులకు నిరసనగా గతంలో వైన్ షాపుల యజమానులు బంద్ కూడా పాటించారు.












Click it and Unblock the Notifications