గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు మృతి
అనంతపురం: అనంతపురంలోని ఒక ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్ర గాయాల పాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పట్టణంలోని ఆంధ్రా బ్యాంకు కాలనీలో నివాసం ఉంటున్న కారు డ్రైవర్ గురప్ప ఇంట్లో గ్యాస్ లీకై సిలిండర్ పేలిపోయింది. దీంతో ఇంటి పైకప్పు కూలిపోయింది.
ఇంటి పై కప్పు ఒక్కసారిగా కూలిపోవడంతో గురప్ప భార్య నాగరత్న, తల్లి నాగమ్మ, కొడుకు రోహిత్ మరణించారు. గాయాల పాలైన గురప్ప ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.












Click it and Unblock the Notifications