రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలోని ఏడో నెంబరు జాతీయ రహదారి బుధవారంనాడు రక్తసిక్తమైంది. జిల్లాలోని శ్రీరాంపూర్ సమీపంలో జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొట్టుకోవడంతో ఐదుగురు మరణించారు. మరో నలుగురు గాయపడ్డారు.
మృతదేహాలను ఆర్మూర్ అస్పత్రికి తరలించారు. తమిళనాడు, మధ్యప్రదేశ్ లకు చెందిన రెండు లారీలు పరస్పరం ఢీకొట్టుకోవడంతో రెండు లారీల మధ్య ఇరుక్కుపోయిన ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంతో అక్కడ విషాద వాతావరణం నెలకొంది.












Click it and Unblock the Notifications