PM Modi: దేశ ప్రజలకు ప్రధాని మోదీ గుడ్‌ న్యూస్‌..!

భారత్ లో అత్యంత సుదీర్ఘ కాలంపాటు నిరంతరాయంగా సేవలందించిన ప్రధానిగా రికార్డు సృష్టించారు నరేంద్ర మోదీ. ఈ నేపథ్యంలో దిల్లీలోని భారత్ మండపంలో ఎన్డీయే నేతలు సమావేశమై మోదీని సన్మానించారు. ఈ మేరకు కేంద్ర మంత్రిమండలి తాజాగా ఒక చారిత్రాత్మక తీర్మానాన్ని ఆమోదించింది. భారత ప్రజాస్వామ్య ప్రస్థానంలో ఇదొక గొప్ప మైలురాయిగా మంత్రి మండలి కొనియాడింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

తన రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను చూశానని.. ఈ మైలురాయికి చేరుకుంటానని ఎప్పుడూ ఊహించలేదని పేర్కొన్నారు. దేవుని అనుగ్రహం వల్లే ఇది సాధ్యమైందని అన్నారు. భారత ప్రధానమంత్రిగా వరుసగా అత్యంత సుదీర్ఘ కాలం పాటు సేవ చేసే అవకాశం లభించడం నా జీవితంలో లభించిన గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. తనకు ప్రజలే దైవస్వరూపులని, వారి సేవ కోసమే తాను ఎల్లప్పుడూ కట్టుబడి ఉన్నానని తెలిపారు. ప్రజా సేవను తాను ఎప్పుడూ ఆధ్యాత్మిక సాధనగా భావించానని పేర్కొన్నారు.

2014 కంటే ముందు దేశంలో అస్థిరత, కుంభకోణాలు జరిగేవని ఆ పాలనను పక్కనపెట్టి దేశ ప్రజలు రాజకీయ స్థిరత్వానికి ఓటేశారని ప్రధాని మోదీ అన్నారు. భారత్ ను ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యం అని తెలిపారు. ఈ మేరకు భారత ఆర్థిక మందగమనాన్ని సూచించడానికి ఉపయోగించిన హిందూ వృద్ధి రేటును ప్రధాని మోదీ తీవ్రంగా తప్పుబట్టారు. దాన్ని కాంగ్రెస్ వృద్ధి రేటు అని పిలవాలని.. ఆ సమయంలో దేశాన్ని పాలించిన కాంగ్రెస్ అసమర్థ విధానాల వల్ల ఆర్థిక వ్యవస్థ కుంటుపడిందని విమర్శించారు.

PMModi Breaks Record as India s Longest Serving Premier Never Imagined Reaching This Milestone

ఈ క్రమంలో గత పదేళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన ప్రగతిని ప్రధాని మోదీ వివరించారు. దేశంలో మౌలిక సదుపాయాల కల్పన వేగంగా జరిగిందని.. రోడ్లు, రైల్వేలు, విమానాశ్రయాల అభివృద్ధిపై దృష్టి పెట్టామని అన్నారు. దాదాపు 25 కోట్లమంది ప్రజల్ని పేదరికం నుంచి విముక్తులను చేశామని పేర్కొన్నారు. దేశాన్ని 2047 నాటికి వికసిత్ భారత్ గా మార్చాలనే సంకల్పంతో తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు. దీనికోసం ఎన్డీఏ కూటమి భాగస్వాములంతా కలిసికట్టుగా పనిచేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. సోలార్​, పవన, న్యూక్లియర్​ ఎనర్జీ దిశగా అడుగులు వేస్తూ, దేశంలో గ్రీన్ హైడ్రోజన్​, గ్రీన్​ అమోనియా ఉత్పత్తి పెరుగుతోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+