కోల్ కత్తాలో ఎగిసిపడిన నందిగ్రామ్ హింస
కోల్ కత్తా: నందిగ్రామ్ పై బుధవారం పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కత్తాలో హింస చెలరేగింది. ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణ చెలరేగడంతో హింస ప్రజ్వరిల్లింది. దీంతో ప్రభుత్వం సైన్యాన్ని పిలిపించింది. నందిగ్రామ్ పై అఖిల భారత మైనారిటీ ఫోరమ్ కోల్ కత్తాలో ప్రదర్శన నిర్వహిస్తుండగా హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి.
ఈ గొడవలో పోలీసు డిప్యూటీ కమీషనర్ (దక్షిణం) జావేద్ షమీమ్ గాయపడ్డారు. ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు, గాజు సీసాలు రువ్వారు. పోలీసులు వారిని నియంత్రించడంలో విఫలం కావడంతో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ రంగంలోకి దిగింది. ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. టియర్ గ్యాస్ వదిలారు. అయినా ఫలితం లేకపోయింది. పరిస్థితి అదుపులోకి వచ్చినప్పటికీ ఉద్రిక్తంగానే ఉంది. బయటవారు లోనికి చొరబడి హింసకు పాల్పడ్డారని ఫోరమ్ అద్యక్షుడు ఇద్రిస్ అలీ విమర్శించారు.












Click it and Unblock the Notifications