మంత్రి అనుచరుడిపై దాడి: సుధాకర్ రెడ్డి లొంగుబాటు
అనంతపురం: అనంతపురం జిల్లాలో వ్యవసాయశాఖ మంత్రి ఎన్. రఘువీరారెడ్డి ముఖ్య అనుచరుడు రవిశంకర్ రెడ్డిపై దాడి కేసులో ప్రధాన నిందితుడు సుధాకర్ రెడ్డి బుధవారంనాడు జిల్లాలోని మడకశిర పోలీసు స్టేషనులో లొంగిపోయాడు. రవిశంకర్ రెడ్డిపై ఈ నెల 11వ తేదీన దాడి జరిగింది.
రవిశంకర్ రెడ్డిపై దాడి కేసులో పోలీసులు పది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఆరుగురిపై హత్యా యత్నం కేసు నమోదు చేశారు. అరెస్టు చేసినవారిని కోర్టులో హాజరు పరచాలని మాజీ శాసనసభ్యుడు ప్రభాకర్ డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications