టీచర్ వేధింపులతో విద్యార్థిని ఆత్మహత్య యత్నం
గుంటూరు: హెడ్ మాస్టర్ రవీంద్రబాబు వేధింపులతో గుంటూరులోని సెయింట్ లారెన్స్ పాఠశాలకు చెందిన విద్యార్థిని సబీనా ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. రవీంద్రబాబు వేధింపుల గురించి తల్లిదండ్రులకు చెప్పి పాఠశాలకు వెళ్లనని సబీనా మొండికేసినా వినకుండా పంపిస్తుండడంతో ఆ విద్యార్థిని విసిగిపోయి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
అయితే తాను ఏ తప్పూ చేయలేదని రవీంద్రబాబు అంటున్నాడు. హెడ్ మాస్టర్ తనను ఇష్టం వచ్చినట్లు తిట్టేవాడని సబీనా చెబుతోంది. నడుముపై గిల్లడం, దగ్గరికి తీసుకోవడం వంటి అసభ్యకరమైన చర్యలకు దిగేవాడని ఆమె అంటోంది. సబీనా పదో తరగతి చదువుతోంది.












Click it and Unblock the Notifications
