నెహ్రూ భూములపై రాధా మరో పోరు
హైదరాబాద్: హైదరాబాదులోని బంజారాహిల్స్ లో కాంగ్రెస్ శాసనసభ్యుడు దేవినేని నెహ్రూకు భూమిని క్రమబద్ధీకరించిన అంశాన్ని కాంగ్రెస్ విజయవాడ తూర్పు నియోజకవర్గం శాసనసభ్యుడు వంగవీటి రాధాకృష్ణ మరోసారి తెర మీదికి తెచ్చారు. నెహ్రూకు కేటాయించిన భూమిని వెంటనే వెనక్కు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఆ భూమిని వెనక్కి తీసుకోకపోతే తన తండ్రి వంగవీటి మోహన రంగా వర్ధంతి రోజు ఈ నెల 26వ తేదీ నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. రంగా వర్ధంతిని అదే రోజు హైదరాబాదులో పెద్ద యెత్తున నిర్వహించాలని తలపెట్టారు.
తన కార్యక్రమాల గురించి చర్చించేందుకు ఆయన సోమవారం మినర్వా హోటల్ లో కాపు సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి 23 జిల్లాల కాపు సంఘాల నాయకులు హాజరయ్యారు. రాధాకృష్ణ తీసుకునే నిర్ణయానికి వారు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఆదివారంనాడు జరిగిన సర్వజన సమ్మేళనానికి హాజరైన కాపు సంఘాల నాయకులు రాత్రి ఇక్కడే బస చేసి రాధాకృష్ణ నిర్వహించిన సమావేశానికి హాజరయ్యారు.












Click it and Unblock the Notifications