రామసేతు పరిరక్షణకు మానవహారం
హైదరాబాద్: రామసేతు పరిరక్షణ కోసం బిజెపి రక్షా వేదిక మంగళవారం నాడు హైదరాబాదులో మానవహారం ఏర్పాటు చేసింది. సికింద్రాబాదులోని వినాయకుడి ఆలయం నుంచి హైదరాబాదులోని చార్మినారు వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పూరీ శంకరాచార్య పాల్గొన్నారు. ఆర్థిక, రాజకీయ, వైజ్ఞానిక పరంగా రామసేతు మహత్తరమైందని, దాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పూరీ శంకరాచార్య అన్నారు. రామసేతుపై కేంద్రం ప్రతిస్పందించకపోతే ఈ నెల 30వ తేదీన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.
ఓటు బ్యాంకు రాజకీయాలతో రామసేతును ధ్వంసం చేయడానికి పూనుకుంటోందని బిజెపి రాష్ట్రాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ విమర్శించారు. ఓట్ల రాజకీయం రామసేతుపై తెలుగుదేశం పార్టీ మౌనం వహిస్తోందని ఆయన అన్నారు. వామపక్షాలు రామసేతును ధ్వంసం చేయాలని అంటున్నారని ఆయన అన్నారు. ర్యాలీలో దాదాపు పదివేల మంది పాల్గొన్నారు. సీతారామలక్ష్మణుల వేషాలతో పిల్లలు అలరించారు.












Click it and Unblock the Notifications