సిఎంతో జుడాల చర్చలు విఫలం
హైదరాబాద్: ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డితో జూనియర్ డాక్టర్లు మంగళవారం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. బోధనా ఆస్పత్రుల్లో రక్షణకు ఆర్డినెన్స్ జారీ చేయాలని, నీలోఫర్ పిల్లల అస్పత్రిలో తమపై దాడి చేసిన మజ్లీస్ శాసనసభ్యుడు అఫ్సర్ ఖాన్ ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ గత పది రోజులుగా నీలోఫర్ జూనియర్ డాక్టర్లు సమ్మె చేస్తున్నారు. వారిని ముఖ్యమంత్రి మంగళవారం చర్చలు జరిపారు.
ఆస్పత్రుల్లో రక్షణ కోసం ఆర్డినెన్సును తెచ్పే విషయంపై పరిశీలన జరుపుతామని ముఖ్యమంత్రి చెప్పారు. అయితే ఆర్డినెన్స్ తెచ్చే వరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్లను నెరవేర్చేవరకు సమ్మెను విరమించబోమని వారంటున్నారు. అఫ్సర్ ఖాన్ పై కేసు నమోదు చేశామని, నేరం రుజువైతే అరెస్టు చేస్తామని డిజిపి యాదవ్ కడపలో చెప్పారు.












Click it and Unblock the Notifications