యువకుడి హత్య: గాలిలోకి పోలీసు కాల్పులు
హైదరాబాద్: హైదరాబాద్ సమీపంలోని రంగారెడ్డి జిల్లా షామీర్ పేట మండలంలోని అలియాబాదులో ఒక యువకుడి హత్య మంగళవారంనాడు పోలీసు కాల్పులకు దారి తీసింది. దీంతో అలియాబాదులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సత్యనారాయణతో పాటు మరో ముగ్గురు మద్యం సేవిస్తూ గొడవ పడ్డాడు. ఈ గొడవలో మిగతా ముగ్గురు సత్యనారాయణను హత్య చేశారని ఆయన బంధువులు ఆరోపిస్తున్నారు. సత్యానారాయణ వార్డు మెంబరు కూడా.
సత్యనారాయణ హత్యతో కోపోద్రిక్తులైన బంధువులు, స్థానికులు రమణ, ఇతర నిందితుల ఇళ్లపై దాడులు చేశారు. దాడులను ఆపడానికి పోలీసులు ప్రయత్నించారు. అయితే ఎంతకీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో పోలీసులు మూడు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపారు. గ్రామానికి మేడ్చల్ నుంచి అదనపు బలగాలను రప్పించారు. పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది.












Click it and Unblock the Notifications