ఇసి నోటీసుకు సోనియా వివరణ
న్యూఢిల్లీ: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీపై చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ ఇచ్చిన నోటీసుకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మంగళవారం వివరణ ఇచ్చారు. మోడీని మృత్యు బేహారి అని వ్యాఖ్యానించినందుకు కమీషన్ సోనియా గాంధీకి నోటీసు జారీ చేసింది. నరేంద్ర మోడీని ఉద్దేశించి తాను ఆ వ్యాఖ్య చేయలేదని సోనియా వివరణ ఇచ్చినట్లు సమాచారం.
సోనియా గాంధీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించలేదని, ప్రభుత్వ రాజకీయ వైఫల్యాలపై మాత్రమే వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ అంటోంది. నోటీసులు అందుకున్న ఎఐసిసి ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్, బిజెపి నాయకుడు వి.కె. మల్హోత్రాలు కూడా తమకు అందిన నోటీసులకు కమీషన్ కు వివరణ ఇచ్చారు. హిందువుల పట్ల సోనియా వైఖరిపై విమర్శలు చేశానే తప్ప ఎన్నికల నియమావళిని తాను ఉల్లంఘించలేదని మల్హోత్రా వివరణ ఇచ్చారు.












Click it and Unblock the Notifications