మనస్తాపంతో బాలుడి ఆత్మహత్య
హైదరాబాద్: అవమాన భారం మోయలేక 12 ఏళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన రంగారెడ్డి జిల్లాలోని వికారాబాదులో జరిగింది. మిత్రుడి తండ్రి కొట్టడంతో మనస్తాపానికి గురైన పరమేశ్వర్ అనే బాలుడు ఉరి వేసుకుని అత్మహత్య చేసుకున్నాడు. పరమేశ్వర్ ప్రభుత్వ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు.
మంగళవారం మధ్యాహ్న భోజన సమయంలో టిఫిన్ తినేందుకు ప్లేటు తెచ్చుకోవడానికి పరమేశ్వర్ తన మిత్రుడి ఇంటికి వెళ్లాడు. పరమేశ్వర్ ను చూసిన మిత్రుడి తండ్రి బెత్తంతో కొట్టాడు. దొంగతనం చేయడానికి వచ్చావంటూ పరమేశ్వర్ పై ఆరోపణ చేస్తూ అతను కొట్టాడు. దీంతో మనస్తాపంతో పరమేశ్వర్ మంగళవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన స్థానికులను కలచివేసింది.












Click it and Unblock the Notifications