జుడాలకు గల్లా అరుణకుమారి హెచ్చరిక
హైదరాబాద్: జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించకపోతే తీవ్ర పరిణామాలుంటాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి గల్లా అరుణకుమారి హెచ్చరించారు. ప్రత్యేక రక్షణ వ్యవస్థను ఇస్తామని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి హామీ ఇచ్చినా జూనియర్ డాక్టర్లు సమ్మెను ఎందుకు కొనసాగిస్తున్నారో అర్థం కావడం లేదని ఆమె బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. జూనియర్ డాక్టర్లు సమ్మెను విరమిస్తారని ఆశిస్తున్నట్లు ఆమె తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు జూనియర్ డాక్టర్లు సమ్మెను విరమించాలని ఆమె సూచించారు.
సమ్మెను విరమించాలని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి వనబాక లక్ష్మి కూడా జూనియర్ డాక్టర్లకు సూచించారు. నీలోఫర్ చాలా పెద్ద ఆస్పత్రి అని, రోగులకు ఇబ్బంది కలిగించే విధంగా జూనియర్ డాక్టర్లు సమ్మె చేయడం తగదని ఆమె అన్నారు. జూనియర్ డాక్టర్ల భద్రతకు ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన తర్వాత కూడా సమ్మెను కొనసాగించడం సరి కాదని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications