జుడాలకు హైకోర్టు డెడ్ లైన్
హైదరాబాద్: సమ్మె విరమణకు రాష్ట్ర హైకోర్టు బుధవారం నీలోఫర్ అస్పత్రి జూనియర్ డాక్టర్లకు డెడ్ లైన్ పెట్టింది. సమ్మె విరమణ విషయంలో బుధవారం పన్నెండున్నర గంటల లోగా తేల్సుకోవాలని హైకోర్టు హెచ్చరించింది. సమ్మెను విరమించుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా హెచ్చరించింది. సమ్మె విరమించకపోతే డిగ్రీల రద్దుకు సిఫార్సు చేస్తామని అన్నది. సమస్యలు ఏమైనా వుంటే కోర్టుకు నివేదించాలని, సమ్మె చేయడానికి వీలు లేదని సూచించింది. జూనియర్ డాక్టర్ల సమ్మె వల్ల అమాయకుల ప్రాణాలు పోతున్నాయని ఆరోపిస్తూ దాఖలైన ప్రజాప్రయోజనాల పిటిషనుపై హైకోర్టు విచారణ చేపట్టింది.
తాము సమ్మెను విరమించుకునే ప్రసక్తి లేదని జూనియర్ డాక్టర్లు అంటున్నారు. తాము ఈ రోజు నుంచి నిరవధిక దీక్షకు దిగుతామని వారు చెబుతున్నారు. తమకు కోర్టుపై గౌరవం ఉందని, తమకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత కోర్టుపై కూడా ఉందని వారంటున్నారు. తాము అరెస్టులకు భయపడబోమని, జైళ్లకు వెళ్లడానికి వెనుకాడబోమని వారంటున్నారు.












Click it and Unblock the Notifications