నిర్మాతపై దేవెగౌడ పరువు నష్టం దావా


Deva Gowdaబెంగుళూర్: మాజీ ప్రధాని, జనతాదళ్ - సెక్యులర్ అధినేత దేవెగౌడ ముఖ్యమంత్రీ, ఐ లవ్ యూ అనే సినిమా నిర్మాతపై పరువు నష్టం దావా వేశారు. సినిమా తన, తన కుటుంబ సభ్యుల పరువు తీసేదిగా ఉందని ఆరోపిస్తూ ఆయన పది కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేశారు. ఈ కేసు డిసెంబర్ 15వ తేదీన కోర్టు ముందు విచారణకు వచ్చే అవకాశం ఉంది. తనపై, తన కుటుంబంపై నిందారోపణలు చేయకుండా నిర్మాతను ఆదేశించాలని గౌడ కోర్టును కోరారు.

సినిమా షూటింగ్ జరుగుతోంది. దీన్ని మరో రెండు నెలల్లో విడుదల చేయాలనేది నిర్మాత సంకల్పం. కర్ణాటక శాసనసభకు వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఎన్నికలు జరుగుతాయని భావిస్తున్నారు. ఈ సందర్భంగా ఆ సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నట్లు సమాచారం. మాజీ ముఖ్యమంత్రికి, సినీ పరిశ్రమలోని ఒక ప్రముఖ స్త్రీకి మధ్య సంబంధం ఈ సినిమా ఇతివృత్తమని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+