అబ్బాయితో మాటలకు గెంటివేత: అత్మహత్యయత్నం
సంగారెడ్డి: అబ్బాయితో మాట్లాడినందుకు ఇంటికి తీసికెళ్లాలని తల్లిదండ్రులకు ప్రిన్సిపాల్ ఆదేశించినందుకు మనస్తాపం చెందిన విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించింది. మెదక్ జిల్లా పటాన్ చెరు మండలం చిట్కూరు గురుకుల పాఠశాలలో ప్రత్యూష అనే అమ్మాయి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతోంది. తన గ్రామానికే చెందిన సంతోష్ అనే అబ్బాయితో ఆమె ఒకటి రెండు సార్లు మాట్లాడింది. దీన్ని గమనించిన ప్రిన్సిపాల్ ప్రత్యూషకు ఇంటికి తీసికెళ్లాలని ఆమె తల్లిదండ్రులను ఆదేశించాడు.
తమ అమ్మాయి భవిష్యత్తు నాశనం చేయవద్దని, ఇక ముందు అలా జరగకుండా చూస్తామని, ఇంటికి పంపించవద్దని ప్రత్యూష తల్లిదండ్రులు ప్రిన్సిపాల్ ను వేడుకున్నారు. అయినా ఆ మొండి ప్రిన్సిపాల్ వినలేదు. దీంతో మనస్తాపానికి గురైన ప్రత్యూష ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యా యత్నం చేసింది. తీవ్రంగా గాయపడని ప్రత్యూష ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అబ్బాయితో గల సంబంధం ఏమిటో తెలుసుకోకుండానే ప్రిన్సిపాల్ అలా మొండికేయడాన్ని ప్రత్యూష అక్క స్వరూప తప్పుపడుతోంది.












Click it and Unblock the Notifications