జుడాలపై ఎస్మాను ప్రయోగించాలి: అసదుద్దీన్
హైదరాబాద్: అస్పత్రుల వైద్యుల రక్షణకు ఆర్డినెన్స్ అవసరం లేదని మజ్లీస్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లపై ఎస్మా ప్రయోగించాలని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బోధనాస్పత్రుల్లో పరిస్థితిపై శ్వేతపత్రం ప్రకటించాలని కూడా ఆయన ఫ్రభుత్వాన్ని కోరారు. ఆస్పత్రుల్లో పరిస్థితులపై విచారణకు సభా సంఘం వేయాలని ఆయన శాసనసభ స్పీకరుకు విజ్ఞప్తి చేశారు.
జూనియర్ డాక్టర్లు తమ ప్రాథమిక విధిని విస్మరించి పనికి మాలిన వ్యూహాలతో సమ్మెలు నిర్వహిస్తున్నారని ఆయన తప్పు పట్టారు. జూనియర్ డాక్టర్ల డిగ్రీలు రద్దు చేయాలని కూడా ఆయన కోరారు. బోధనాస్పత్రుల్లో ప్రత్యేక రక్షణ దళాలను ఏర్పాటు చేస్తే రేపు రెవెన్యూ ఉద్యోగులు కూడా అడుగుతారని, ప్రభుత్వ శాఖలన్నింటికి రక్షణ కల్పించడానికి 2 వేల సిబ్బంది కావాల్సి ఉంటుందని ఆయన అన్నారు. గ్రేహౌండ్స్ వచ్చినా రోగులను ఏమీ చేయలేరని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications