చిరు వస్తే పరిణామాలు తీవ్రమే: దత్తాత్రేయ
విజయవాడ: మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి వస్తే పరిణామాలు తీవ్రంగానే ఉంటాయని భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్రాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ అభిప్రాయపడ్డారు. జూనియర్ డాక్టర్లపై దాడి చేసిన మజ్లీస్ శాసనసభ్యులపై చర్య తీసుకోవడంలో ప్రభుత్వం నిరాసక్తత ప్రదర్శిస్తోందని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం మజ్లీస్ శాసనసభ్యులపై చర్య తీసుకోవడం లేదని ఆయన విమర్శించారు.
మజ్లీస్ శాసనసభ్యులపై ప్రభుత్వం చర్య తీసుకోకపోవడాన్ని బిజెపి శాసనసభ్యుడు జి. కిషన్ రెడ్డి తప్పు పట్టారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వం మజ్లీస్ శాసనసభ్యుల తీరుపై ఉదాసీన వైఖరి అవలంబిస్తోందని ఆయన అన్నారు. హైదరాబాదులోని ఉస్మానియా వైద్య కళాశాలలో జరిగిన జూనియర్ డాక్టర్ల తల్లిదండ్రుల సమావేశానికి ఆయన హాజరయ్యారు. మైనారిటీలకు మజ్లీస్ కు సంబంధం లేదని, అది రజాకార్ల పార్టీ అని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications