ఆర్డినెన్స్ అవసరం లేదు: జెపి
హైదరాబాద్: ఆస్పత్రుల్లో రక్షణకు ఆర్డినెన్స్ అవసరం లేదని లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ అభిప్రాయపడ్డారు. దాడి చేసినవారిని శిక్షించడానికి తగిన చట్టాలున్నాయని, కొత్తగా అర్డినెన్సు అవసరం లేదని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. అడిగేవాళ్లు ఏం అడుగుతున్నరో, ఇచ్చేవాళ్లు ఏం ఇస్తామంటున్నారో అర్థం కావడం లేదని ఆయన అన్నారు.
ఆర్డినెన్స్ జారీ చేయాలని అనడం, చేస్తామని ప్రభుత్వం అనడం ప్రజలను వెర్రివాళ్లను చేయడమేనని ఆయన అన్నారు. చట్టాలు చేసేవాళ్లు రక్షణ కల్పించలేక హామీలు కొత్తగా ఇస్తున్నారని ఆయన అన్నారు. మజ్లీస్ శాసనసభ్యులు తప్పు చేశారని తేలితే వారి సభ్యత్వాలను రద్దు చేయాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications