సమ్మె విరమణకు జుడాల నిరాకరణ
హైదరాబాద్: సమ్మెను విరమించడానికి జూనియర్ డాక్టర్లు నిరాకరించారు. ఆస్రత్రుల్లో రక్షణకు ఆర్డినెన్సును జారీ చేసే వరకు సమ్మెను విరమించేది లేదని వారు స్పష్టం చేస్తున్నారు. ఆర్డినెన్సును తీసుకురావడానికి ప్రభుత్వం అంగీకరించడం శుభపరిణామమని వారంటూనే సమ్మె కొనసాగుతుందని చెబుతున్నారు. తమపై నీలోఫర్, నయాపూల్ అస్పత్రుల్లో దాడి చేసిన మజ్లీస్ శాసనసభ్యులు అఫ్సర్ ఖాన్, ఖాద్రీపాషాలపై చర్యలు తీసుకోకపోవడాన్ని వారు తప్పు పట్టారు.
జూనియర్ డాక్టర్లకు మద్దతుగా భారత వైద్య మండలి రేపు సమ్మెకు పిలుపునిచ్చింది. ప్రభుత్వాస్ఫత్రుల్లోనే కాకుండా ప్రైవేట్ డాక్టర్లకు కూడా రక్షణ కల్పిస్తూ ఆర్డినెన్సు తేవాలని ఐఎంఎ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. అస్పత్రులు, క్లినిక్ లు కూడా రేపు సమ్మెలో పాల్గొంటాయని ఆయన చెప్పారు. అత్యవసర సేవలు మాత్రం కొనసాగుతాయని వైద్యుల కార్యాచరణ కమిటీ తెలియజేసింది. రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న జూనియర్ డాక్టర్ల సమ్మెతో ప్రభుత్వాస్పత్రుల్లో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.












Click it and Unblock the Notifications