రేపు ఆంధ్ర విద్యార్థుల మృతదేహాలు తరలింపు
హైదరాబాద్: అమెరికాలోని లూసియానా విశ్వవిద్యాలయంలో దారుణ హత్యకు గురైన ఆంధ్రప్రదేశ్ కు చెందిన విద్యార్థులు కిరణ్ కుమార్, చంద్రశేఖర రెడ్డిల మృతదేహాలను రేపు స్వస్థలాలకు తరలిస్తున్నారు. వీరి హత్యను లూసియానాలోని విద్యార్థి సంఘం తీవ్రంగా పరిగణిస్తోంది. వారి మృతికి రేపు లూసియానా విశ్వవిద్యాలయంలో శ్రద్ధాంజలి ఘటించనున్నారు. ఈ విద్యార్థుల మృతదేహాల గురించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమను సంప్రదించలేదని అమెరికాలోని భారత రాయబార కార్యాలయం తెలియజేసింది.
లూసియానా గవర్నర్ భారత సంతతికి చెందినవారైనా భారత విద్యార్థులకు రక్షణ లేకుండా పోయిందని విద్యార్థి సంఘం విమర్శించింది. ఆంధ్ర విద్యార్థుల హత్యను లూసియానా గవర్నర్ బాబి జిందాల్ ఖండించారు. తెలుగు విద్యార్థుల హత్యకు సంబంధించిన క్లూ ఇప్పటి వరకు పోలీసులకు లభించలేదు. లూసియానా విశ్వవిద్యాలయంలో దాదాపు 750 మంది విద్యార్థులు భారతదేశానికి చెందినవారున్నారు.












Click it and Unblock the Notifications