ప్రమోద్ హత్య కేసు: ప్రవీణే దోషి
ముంబై: భారతీయ జనతా పార్టీ (బిజెపి) సీనియర్ నాయకుడు ప్రమోద్ మహాజన్ హత్య కేసులో ఆయన సోదరుడు ప్రవీణ్ మహాజన్ నే దోషిగా ముంబై సెషన్స్ కోర్టు సోమవారం నిర్ధారించింది. ప్రవీణ్ పై హత్య, బలవంతంగా ఇంట్లోకి చొరబడిన కేసులు నమోదయ్యాయి. పథకం ప్రకారమే తాను ప్రమోద్ మహాజన్ ను హత్య చేసినట్లు ప్రవీణ్ మహాజన్ ఈ నెల 15వ తేదీన కోర్టులో అంగీకరించారు.
ప్రమోద్ మహాజన్ కు ప్రవీణ్ మహాజన్ పంపిన ఎస్సెమ్మెస్ లు కూడా హత్య పథకం ప్రకారం జరిగినట్లు రుజువు చేస్తున్నాయని కోర్టు అభిప్రాయపడింది. హత్య వెనక డబ్బుకు సంబంధించిన వ్యవహారం, సోదరుల మధ్య విభేదాలు కారణమనే ప్రాసిక్యూషన్ వాదనను కోర్టు తిరస్కరించింది. విచారణ సందర్భంగా ప్రమోద్ మహాజన్ భార్య రేఖ, కూతురు పూనమ్, బావ గోపీనాధ్ ముండే, ప్రవీణ్ భార్య సారంగి కోర్టు ముందు సాక్షులుగా హాజరయ్యారు. ప్రమోద్ పైకి తాను మూడు బుల్లెట్లు కాల్చానని అంగీకరిస్తూ ప్రవీణ్ ఏప్రిల్ 22వ తేదీన కోర్టులో పోలీసుల ముందు లొంగిపోయారు.












Click it and Unblock the Notifications
