కోట్లు పలికిన కోకాపేట భూములు
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని కోకాపేట భూములు కోట్ల రూపాయల ధర పలికాయి. కోకాపేటలోని వంద ఎకరాల భూమిని హైదరాబాద్ నగరాభివృద్ధి సంస్థ (హుడా) నాలుగు చీరికలుగా చేసి గురువారంనాడు వేలం వేసింది. అయితే హుడా 25 ఎకరాలను విక్రయించగలిగింది. ఎకరం ధర 12.1 కోట్ల రూపాయల ధర పలికింది. దీంతో హుడా 300 కోట్ల 25 లక్షల రూపాయలు సమకూరాయి.
మిగతా 75 ఎకరాల కొనుగోలుకు బిడ్డర్లు ముందుకు రాలేదు. భూముల వేలాన్ని వ్యతిరేకిస్తూ తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కార్యకర్తలు ఆందోళనకు దిగారు. భూముల వేలాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు వారిని చెదరగొట్టారు. కొంతమంది కార్యరక్తలను అరెస్టు చేశారు. ప్రతిపక్షాల దుష్ప్రచారం వల్ల భూమికి తగిన ధర పలకలేదని హుడా చైర్మన్ సుధీర్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications