ఆంధ్రప్రదేశ్ లో బిజెపి సంబరాలు
హైదరాబాద్: గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో పార్టీ విజయంతో రాష్ట్రంలోని భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. హైదరాబాదులో జరిగిన సంబరాల్లో బిజెపి రాష్ట్రాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ, ప్రధాన కార్యదర్శి కె. లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాదులోని బిజెపి కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. నల్లగొండలో బిజెపి కార్యకర్తలు విజయోత్సవాలు నిర్వహించుకున్నారు.
గుజరాత్ ఎన్నికల ఫలితాలతో దేశ రాజకీయాలు మలుపు తిరుగుతాయని దత్తాత్రేయ అన్నారు. అభివృద్ధి చేతిలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కుహనా లౌకికవాదం ఓడిపోయిందని ఆయన అన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని మృత్యు బేహారి అన్నందుకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. గుజరాత్ లో అవినీతి లేదని, సమర్థమైన పాలనను అందించామని, దాని వల్లనే బిజెపి గెలిచిందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications