గుజరాత్ లో మోడీ గాలి: 27న ప్రమాణం
అహ్మదాబాద్: గుజరాత్‌లో ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ తిరిగి అధికారాన్ని నిలబెట్టుకున్నారు. మొత్తం 182 అసెంబ్లీ నియోజకవర్గాలు కలిగిన గుజరాత్ అసెంబ్లీకి డిసెంబర్9, డిసెంబర్16న రెండు దశల్లో పోలింగ్ జరుగగా ఆదివారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొత్తం 182 స్థానాలకుగాను భారతీయ జనతా పార్టీ (బిజెపి)120 స్థానాల్లోను, కాంగ్రెస్ కూటమి 55 స్థానాల్లో, ఇతరులు ఏడు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఈ వార్త రాసే సమయానికి నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపి అధికారం చేపట్టడానికి అవసమైన ఆధిక్యతను సంపాదించుకుంది.
ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ ఈ నెల 27వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ తిరిగి మూడో సారి బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ విజయంపై భాజపా స్పందిస్తూ ఇది గుజరాతీయుల విజయంగా ప్రకటించింది. బిజెపి గుజరాత్ లో విజయం సాధించడం ఇది వరుసగా నాలుగో సారి.












Click it and Unblock the Notifications