ఓటమిని అంగీకరించిన కాంగ్రెస్
అహ్మదాబాద్: గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ తన ఓటమిని అంగీకరించింది. నరేంద్ర మోడీకి ఇది గొప్ప విజయమని, ప్రశంసనీయమైన విజయమని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీ అన్నారు. అయితే విజయం వల్ల గోద్రా అనంతర సంఘటనలకు సంబంధించిన మోడీపై మచ్చ తొలగిపోదని, మోడీ ముఖ్యమంత్రిగా కాలంలో జరిగిన సంఘటనలన్నీ రూపుమాసిపోవని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
లౌకిక విలువలకు తిలోదకాలిచ్చిన విషయం రూపుమాసిపోయినట్లు కాదని ఆయన అన్నారు. మోడీ అభినందనలకు అర్హుడని ఆయన అన్నారు. ఈ ఫలితాలు తప్పకుండా తమ పార్టీని అసంతృప్తికి గురి చేశాయని ఆయన అన్నారు. తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సభలకు లభించిన ప్రజాస్పందనను ఓట్లుగా మార్చుకోలేకపోయామని కాంగ్రెస్ నాయకులు అన్నారు. గుజరాత్ ఫలితాలతో కాంగ్రెస్ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.












Click it and Unblock the Notifications