పంజగుట్టలో బాంబు కలకలం
హైదరాబాద్: హైదరాబాదులోని పంజగుట్టలో బాంబు ఉన్నదనే ప్రచారం సోమవారంనాడు కలకలం సృష్టించింది. సూట్ కేసులో బాంబు ఉందనే భయంతో ప్రజలు పరుగులు తీశారు. దీంతో వెంటనే పోలీసు బలగాలు, యాంటీ బాంబు స్క్వాడ్ రంగ ప్రవేశం చేశాయి.
సూట్ కేసును క్షుణ్నంగా పరిశీలించిన యాంటీ బాంబు స్క్వాడ్ బాంబు ఉన్నదనే ప్రచారం ఉత్తదేనని తేల్చింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.












Click it and Unblock the Notifications