పార్టీ కన్నా పెద్దవాడ్ని కాను: మోడి
గాంధీనగర్: శాసనసభా పక్ష సమావేశంలో బిజెపి నేత నరేంద్ర మోడి కళ్ల నీళ్ల పర్యంతమయ్యారు. ఒకింత భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. తాను ఇంతవాణ్ని కావడానికి పార్టీ కార్యకర్తలే కారణమని ఆయన అన్నారు. పార్టీ తన కన్నతల్లి అని, పార్టీ కన్నా తాను గొప్పవాడిని కాదని ఆయన అన్నారు. మీడియా గుజరాత్ ఎన్నికల ఫలితాలను సరిగా అంచనా వేయలేకపోయాయని ఆయన అన్నారు.
మీడియా తీరును ఆయన ఆక్షేపించారు. తనను అతిగా పొగడవద్దని ఆయన హితవు చెప్పారు. దృష్టి లోపం వల్ల తాను కొందరికి పార్టీ కన్నా పెద్దవాడిగా కనిపిస్తున్నానని, అలా అనేవాళ్లకు జనసంఘ్ చరిత్ర, పార్టీ చరిత్ర తెలియదని ఆయన అన్నారు. శాసనసభా సమావేశానికి బిజెపి నాయకులు అరుణ్ జైట్లీ, ఎం. వెంకయ్యనాయుడు హాజరయ్యారు.












Click it and Unblock the Notifications